ఎల్లారెడ్డిలోని ఇనాఓ దార్ గల్లిలో, భర్త నజీమ్ మద్యం సేవించి వేధిస్తున్నాడని భార్య రేష్మ డయల్-100కు కాల్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ కే. సాయికిరణ్‌పై నజీమ్ కత్తితో దాడికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్ తప్పించుకుని ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగింది.