శుక్రవారం సాయంత్రం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పడి అన్నారం యాదగిరి (53) మృతి చెందినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం భార్య మరణించడంతో యాదగిరి మద్యం బానిసయ్యాడు. గురువారం మద్యం సేవించి కుమారులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి, రాత్రి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.