జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య

4చూసినవారు
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
జనగామ గ్రామంలో గురువారం ఇష్టం లేని పెళ్లితో జీవితంపై విరక్తి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన మోకిరే అనూష (21)కు బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో నవంబర్‌లో వివాహం జరిగింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని అనూష ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి బాలమల్లయ్య ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.