సామూహిక కుంకుమార్చనలు.. అన్నప్రసాద వితరణ

768చూసినవారు
సామూహిక కుంకుమార్చనలు.. అన్నప్రసాద వితరణ
ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి గణేష్ మండలి వద్ద సోమవారం గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా 8వ రోజు సువాసిని మహిళలచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితులు ప్రణయ్ జోషి పంతులు ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు విద్య రవికుమార్, ప్రధాన కార్యదర్శి పద్మ కాశీరాం, గణేష్ మండలి ప్రతినిధులు, మహిళా కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్