ఎల్లారెడ్డిలో వీర హనుమాన్ విజయ యాత్రకు భారీ సన్నహాలు

0చూసినవారు
ఎల్లారెడ్డిలో వీర హనుమాన్ విజయ యాత్రకు భారీ సన్నహాలు
ఈ నెల 2న ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా "వీర హనుమాన్" విజయ యాత్రకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. హిందువునని గర్విస్తూ, జైశ్రీరామ్ అని నినదిస్తూ, కుల, రాజకీయాలకు అతీతంగా ధర్మ రక్షకులుగా, హైందవ వీరులుగా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర సాతల్లి బేస్, ఆజాద్ గ్రౌండ్, పబ్బతి హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమై, పురవీధుల వెంట, పెద్ద మసీదు, గాంధీచౌక్, శివాజీ చౌక్ మీదుగా రామాలయం వరకు సాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్