మర్కల్ విద్యార్థినుల అథ్లెటిక్స్ లో సత్తా, రాష్ట్ర స్థాయికి ఎంపిక

904చూసినవారు
మర్కల్ విద్యార్థినుల అథ్లెటిక్స్ లో సత్తా, రాష్ట్ర స్థాయికి ఎంపిక
కామారెడ్డి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మర్కల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వారు మొత్తం 11 స్వర్ణ, 10 రజత, 4 కాంస్య పతకాలు సాధించి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఎం. అమృత, సీహెచ్. వైష్ణవి, బి. నవ్యశ్రీ, ఎం. మహేశ్వరి, బి. ప్రహర్ష, జి. అర్చన, ఎం. వెన్నెల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విజయం సాధించిన విద్యార్థినులను మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ కృష్ణవేణి, పీడీ రమాదేవి, అధ్యాపకులు అభినందించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్