పోచారం ప్రాజెక్టులోకి 782క్యూసెక్కుల స్వల్ప వరద
ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి శనివారం మధ్యాహ్నం 12:30 గంటల వరకు 782 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తుందని ప్రాజెక్టు డీఈ. షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు జలాశయంలోకి వస్తున్న వరద మొత్తం ప్రాజెక్టు కట్టపై నుండి జలపాతంలా పడుతూ మంజీరా ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. ఈ ఖరీఫ్లో బలమైన నిజాం కాలం నాటి కట్టడంగా వున్నా పోచారం ప్రాజెక్టు 29.002టీఎంసీల వరదను తట్టుకొని రికార్డు బ్రేక్ చేసింది.
