ఎల్లారెడ్డి బస్‌స్టాండ్ వద్ద ఆదివారం తప్పిపోయి తిరుగుతున్న సుమారు 10 ఏళ్ల బాలుడిని ఎల్లారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, బాలుడు తన పేరు రాఘవ, తండ్రి పేరు కిరణ్ అని మాత్రమే చెప్పాడు. ఇతర వివరాలు చెప్పడం లేదని ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. బాలుడి గురించి తెలిసినవారు వెంటనే ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను 8712666233 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.