ఆసుపత్రి డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే

2చూసినవారు
ఆసుపత్రి డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే
మద్నూర్, బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, స్థానిక ప్రజా ప్రతినిధులు, దాతల సహకారం, ఐకేఎఫ్ నిధుల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చి, ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.