ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు సోమవారం ఉదయం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని బస్ స్టాండ్ క్యాంటీన్‌లో అల్పాహారం చేశారు. ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించబడిన నూతన బస్ స్టాండ్‌ను ఆయన పరిశీలించారు. బస్ స్టాండ్‌లో నిర్మించిన వ్యాపార సముదాయాలను కూడా యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ టెండర్ ద్వారా క్యాంటీన్‌ను దక్కించుకున్నారు. వినోద్ గౌడ్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే క్యాంటీన్‌కు వెళ్లి, బస్ స్టాండ్‌ను పరిశీలించి, అక్కడే అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.