జుక్కల్ సెగ్మెంట్లోని జుక్కల్, పెద్ద కొడప్గల్ మండల కేంద్రాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు చెక్కులు పంపిణీ చేశారు. ఈ పథకాల ప్రధాన లక్ష్యం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.