ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేసారు. తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన కల్యాణ లక్ష్మి లబ్దిదారులైన గురుడు రాజమణి, కుమ్మరి రామవ్వలకు ఈ చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో కరడ్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం. రాజప్పతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.