తాడ్వాయిలో 40 లక్షల సీసీరోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

1చూసినవారు
తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రూ. 40 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శబరిమాత ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో రూ. 20 లక్షలతో చేపట్టనున్న నూతన రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శుభారంభం చేశారు. ఈ పనులు పూర్తయితే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్