సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం డోంగ్లీ మండల కేంద్రంతో పాటు మోఘ, ఏలేగావ్, కుర్లా గ్రామాల్లో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పనుల్లో నాణ్యత లోపం లేకుండా అధికారులు, ప్రజలు పరిశీలించాలని, లోపం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
