అయ్యప్ప ఆలయం వాకిలిలో సీసీ కోసం అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

2చూసినవారు
కార్తీక మాసం అయ్యప్ప స్వాముల సీజన్ ప్రారంభం నేపథ్యంలో, ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ ఆవరణలో డిసెంబర్ 15వ తేదీలోగా సీసీ రోడ్డు వేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు ఇంజనీరింగ్ అధికారులను సోమవారం ఆదేశించారు. ఆలయం వద్ద బురద వల్ల భక్తులకు కలుగుతున్న అసౌకర్యాన్ని మాజీ మున్సిపల్ చైర్మెన్ పద్మశ్రీకాంత్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన స్పందించి 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు చేపట్టాలని ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.