బాన్సువాడలోని కల్కి చెరువు బుంగ మరమ్మత్తు పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, బుంగ మరమ్మత్తు పనుల కోసం ప్రభుత్వం రూ. 27 లక్షల 60 వేలు మంజూరు చేసిందని తెలిపారు. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. పనుల వేగం పెంచాలని సూచించారు.