పెద్ద చెరువు కట్టపై మార్నింగ్ వాక్ చేసిన ఎమ్మెల్యే

1చూసినవారు
ఎల్లారెడ్డి - హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉన్న ఎల్లారెడ్డి పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చెరువు కట్టపై కిలోమీటరుకు పైగా వాకింగ్ టైల్స్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే చెరువు కట్టపై వాకింగ్ చేస్తూ పనులు పరిశీలించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు పద్మ శ్రీకాంత్, కురుమ సాయిబాబా, వినోద్ గౌడ్, విద్యాసాగర్, గయజొద్దీన్ ఉన్నారు.