ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న పర్మల్ల గ్రామానికి చెందిన ఇర్ల కీర్తనను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్, మండల నాయకులు సాయికుమార్, ఇర్ల శ్రీనివాస్, నగేష్, రమేష్, బాల గౌడ్, శివలాల్ ఉన్నారు.