కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడ్వాయి మండలంలోని భ్రహ్మజివాడి గ్రామ సిద్ధులగుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయంలో జరిగిన 34వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరయ్యారు. ఎమ్మెల్యే గారు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, ఎల్లారెడ్డి సెగ్మెంట్ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండి అధిక దిగుబడులు రావాలని మొక్కుకున్నారు.