పిల్లలను వాసిలి వెళ్లిన తల్లి.... పోలీసుల చెంతకు పిల్లలు

3చూసినవారు
సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్దామని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన లక్ష్మి, డబ్బులు తెస్తానని చెప్పి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆమె ఇద్దరు కూతుళ్లు రాత్రి నుంచి ఆసుపత్రి గేటు వద్ద తల్లి కోసం ఎదురుచూశారు. పెద్ద కూతురు గంగోత్రి కస్తూరిబాలో టెన్త్, చిన్న కూతురు చిన్న ఎక్లారా స్కూల్లో 2వ తరగతి చదువుతున్నారు. వారి సొంతూరు మద్నూర్ మండలం చిన్న ఎక్లారా. తల్లి మాట నమ్మి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన ఆ పిల్లలను చివరికి ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్