కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలం తాండూర్ గ్రామంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను కొలతల ప్రకారం చేపట్టాలని, ఉపాధి హామీ కూలీల హాజరు పట్టికను పరిశీలించి, అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.