నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధానకాల్వ ద్వారా ఆయకట్టు రైతులకు విడుదల చేసిన సాగు నీటి విడుదలను గురువారం సాయంత్రం 3 గంటలకు నిలిపివేసినట్లు ప్రాజెక్టు ఏఈ. సాకేత్ తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405అడుగులు కాగా, నీటిని నిలిపి వేసే సమయానికి ప్రాజెక్ట్ లో1397. 17అడుగుల నీరు నిలువ వుందన్నారు. టీఎంసిల్లో 17. 802టీ ఎం సీలు ఉండగా, జలాశ యంలో 8. 579టీ ఎం సీ ల నిరు నిలువ వుందన్నారు.