మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డి. ప్రశాంత్ కుమార్, నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆయన, అభ్యర్థులు సమర్పించే ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే అదనపు పత్రాలు కోరాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించాలని ఆయన ఆదేశించారు.