లక్ష్మాపూర్‌లో 3వ రోజు కొనసాగిన ఎన్ఎస్ఎస్ శిబిరం

1చూసినవారు
లక్ష్మాపూర్‌లో 3వ రోజు కొనసాగిన ఎన్ఎస్ఎస్ శిబిరం
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి కాల శిబిరం మూడవ రోజు సోమవారం కొనసాగింది. ప్రోగ్రామ్ ఆఫీసర్ జి. రాణి తెలిపిన వివరాల ప్రకారం, వాలంటీర్లలో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వాలంటీర్లు రక్షణ కొండ నిలయం, శివాలయ పరిసర ప్రాంతాల్లో శ్రమదానం చేసి, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. వ్యర్థాలను సేకరించి, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఈ కార్యక్రమం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్