ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శివకుమార్ మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. శుక్రవారం మండలంలోని అడివిలింగాల గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) ద్వారా గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఆర్థిక, సాంస్కృతిక సంప్రదాయాల గురించి తెలియజేయాలని సూచించారు.