ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 2 (బాలికల) వాలంటీర్ల వేసవికాలం ప్రత్యేక శిబిరం ఆదివారం రెండో రోజు లక్ష్మాపూర్ గ్రామంలో కొనసాగింది. ప్రోగ్రామ్ అధికారిని జి. రాణి మాట్లాడుతూ, వాలంటీర్లు ప్రభుత్వ పాఠశాల ఆవరణ, మైదానం, గ్రామ పంచాయతీ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను శ్రమదానంతో శుభ్రం చేశారని తెలిపారు. స్వచ్ఛతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వాలంటీర్లు శ్రమదానంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.