రామారెడ్డి గ్రామపంచాయతీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారులను ఇందిరమ్మ కమిటీ ఘనంగా సన్మానించింది. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజులను ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో
చిరు సన్మానం చేశారు. గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్,
కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నామాల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారుల సేవలను కొనియాడుతూ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నామాల రామస్వామి, రాజ నరసయ్య, బిపేట నర్సిములు తదితరులు పాల్గొన్నారు.