తుర్కకాశ అభివృద్ధికి వంద కోట్లు కేటాయించాలి

1చూసినవారు
తుర్కకాశ అభివృద్ధికి వంద కోట్లు కేటాయించాలి
తెలంగాణ తుర్కకాష సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బడే సాబ్ మాట్లాడుతూ, తుర్కకాష వర్గం విద్య, ఆర్థికంగా వెనుకబడి ఉందని, మైనింగ్ శాఖలో 40% వాటా, ప్రత్యేక రిజర్వేషన్లు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్గ అభివృద్ధికి ఏటా 100 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. గత రెండేళ్లుగా సంక్షేమ నిధులు రూ. 24 కోట్లు బకాయి ఉన్నాయని, డిమాండ్లు నెరవేర్చకపోతే హైదరాబాద్‌లో 2000 మందితో ధర్నా చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్