ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతోందని సొసైటీ ఛైర్మన్ ఏగుల నర్సింలు, సెక్రటరీ విశ్వనాథం తెలిపారు. సోమవారం లక్ష్మాపూర్, అడవిలింగాల, గండిమాసాని పేట్, శివ్వాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సెక్రటరీ సందర్శించారు. అకాల వర్షం కురవలేదని, రైతులు ధాన్యం తడవకుండా టార్పలిన్ కవర్లను సిద్ధంగా ఉంచి ఆరబెట్టారని తెలిపారు.