ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున రెండో వార్డ్ అభ్యర్థిగా శుక్రవారం పద్మ నామినేషన్ వేశారు. వార్డు ప్రజలకు మార్పు, అభివృద్ధి కోసం కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక పాత్రికేయుడు మహేష్ తల్లి అయిన పద్మ, కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ చొరవతో హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరి పోటీ చేస్తున్నారు.