నాల్గు గిరిజన తాండలకు కలిపి వాటర్ ప్లాంట్ ఇచ్చిన పైడి

5చూసినవారు
నాల్గు గిరిజన తాండలకు కలిపి వాటర్ ప్లాంట్ ఇచ్చిన పైడి
గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో, తండాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శాస్త్రవేత్త డాక్టర్. పైడి ఎల్లారెడ్డి పర్యటించారు. యడారం తాండలోని జగదాంబ టెంపుల్ ను సందర్శించి, అక్కడి నాలుగు తండాల్లో నీటి ఎద్దడి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే స్పందించి, తన సొంత డబ్బులతో నాలుగు తండాలకు కలిపి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వజ్జెపల్లి హనుమాన్ టెంపుల్ బాగు కోసం నిధులు ఇస్తానని, ఉత్నూర్ గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. తీర్మానం పల్లిలో పాత హనుమాన్ ఆలయంలో భజన కోసం భవనం మరమ్మత్తులు చేయిస్తానని ప్రజలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్