శుక్రవారం నూతన సంవత్సరం సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్‌ను ఎల్లారెడ్డి సెగ్మెంట్ వాసి బీజేపీ రాష్ట్ర నాయకులు డా: పైడి ఎల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈటెలకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బీజెపి ఇన్చార్జి విక్రమ్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు హైమా రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.