నాగిరెడ్డిపేట్ మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ పటేల్ చెరువు కట్ట తెగిపోవడంతో, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు రూ.42 లక్షల నిధులను మంజూరు చేశారు. ఆదివారం గ్రామ సర్పంచ్ మన్నె వెంకటి,
కాంగ్రెస్ నాయకులతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మన్నె వెంకట్ మాట్లాడుతూ, భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో పనులు నాణ్యతతో జరగాలని సూచించారు. గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.