ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ టాయిలెట్లను పూర్తి చేయాలి

6చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ టాయిలెట్లను పూర్తి చేయాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం పాఠశాలల్లో నిర్మాణ దశల్లో పెండింగ్ లో ఉన్న టాయిలెట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో డీఈఓ, సీపీఓ, డీఆర్‌డీఓ, ఏపీడీ, ఈఈ పీఆర్ (కామారెడ్డి) బాన్సువాడ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, పెండింగ్ లో ఉన్న టాయిలెట్ల నిర్మాణ జాబితాపై ఆయన ఆరా తీశారు. పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్