ప్రతి రోజు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యo

తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం అధ్యాపకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిక్షణ, ధ్యానం కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థి, యోగా శిక్షకుడు మిద్దె అజయ్ కుమార్ రెండు గంటల పాటు యోగా ఆసనాలు వేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, విద్యార్థులు యోగా కోసం సమయం కేటాయించాలని ఆయన సూచించారు.
