లయన్స్ ఉగాది నేషనల్ పురస్కారం అందుకున్న ఫిజియో తెరపిస్ట్

0చూసినవారు
లయన్స్ ఉగాది నేషనల్ పురస్కారం అందుకున్న ఫిజియో తెరపిస్ట్
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సృజన్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన లయన్స్ ఉగాది నేషనల్ పురస్కారం -2026కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని, నేటి సమాజంలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యత పెరిగిందని, తాను అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.