ఎల్లారెడ్డిలో పందుల పట్టివేత

0చూసినవారు
ఎల్లారెడ్డిలో పందుల పట్టివేత
ఎల్లారెడ్డి పట్టణంలోని న్యూ అబాది, టీచర్స్ కాలనీ, తహసీల్ కార్యాలయం వెనుక, గాంధీనగర్, చర్చ్ కాంపౌండ్ వంటి పలు వార్డుల్లో పందుల సంచారం పెరిగిపోయింది. డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా, ఆదివారం స్థానిక మున్సిపల్ అధికారులు పందులను పట్టి వాహనాల్లో తరలించినట్లు మున్సిపల్ మేనేజర్ వాసంతి తెలిపారు. ఈ చర్యలు పట్టణ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్