జిల్లాలో పోలీస్ 30, 30(ఎ)యాక్ట్ అమలు

0చూసినవారు
జిల్లాలో పోలీస్ 30, 30(ఎ)యాక్ట్ అమలు
కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఫిబ్రవరి 1 నుండి 28 వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం, పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్