గురువారం కామారెడ్డి జిల్లాలో సీనియర్
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను జిల్లా పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బక్రీద్ పండగ సందర్భంగా ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, షబ్బీర్ అలీకి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి టౌన్ సీఐ నరహరితో పాటు ఇతర సీఐలు, ఎస్ఐలు కూడా పాల్గొన్నారు.