ఎల్లారెడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు

4చూసినవారు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, శుక్రవారం రాత్రి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్ వరకు ఎస్ఐ. బొజ్జ మహేష్, పోలీస్ సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గాంధీచౌక్ వద్ద స్మరించుకున్నారు. ర్యాలీలో దీపాలు వెలిగించి, 2 నిమిషాల మౌనం పాటించి, వారి త్యాగానికి నివాళులు అర్పించారు. దేశ ఏకతా, సమగ్రత, ప్రజా భద్రత కోసం అంకితభావంతో సేవలు అందిస్తామని పోలీసులు సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you