ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో పేదల కలలైన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రేరణతో అరికెల కిష్టన్న నూతన గృహంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల సాయులు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎంపీడీవో, ఎంపీఓ, సూపరింటెండెంట్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నాయక్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా, యూత్ టౌన్ అధ్యక్షులు పాల్గొన్నారు. గృహ యజమానిని వారు ఆశీర్వదించారు.