కామారెడ్డిలో పారిశుధ్య లోపం: చెత్తకుప్పలో కౌన్సిలర్ నిరసన

0చూసినవారు
కామారెడ్డిలో పారిశుధ్య లోపం: చెత్తకుప్పలో కౌన్సిలర్ నిరసన
కామారెడ్డి పట్టణంలోని పాత ప్రాంతాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలు చెత్తకుప్పలుగా మారడంపై 46, 47 వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తూ, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ చెత్తలోనే కూర్చుని నిరసన తెలిపారు. పారిశుధ్య కార్మికుల షిఫ్టుల మార్పుతో ఉదయం 11 గంటలైనా రోడ్లు శుభ్రం కావడం లేదని, దీనివల్ల ఆసుపత్రికి వచ్చే రోగులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్