కులవివక్షపై పోసానిపేట్ గ్రామస్తులకు అవగాహన

3చూసినవారు
కులవివక్షపై పోసానిపేట్ గ్రామస్తులకు అవగాహన
పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి నాగరాజు, మండల రెవెన్యూ అధికారి రవి కుమార్, ఎస్ఐ రాజశేఖర్ గ్రామస్తులకు ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కులవివక్షత, సైబర్ నేరగాళ్ల మోసాల గురించి వివరించారు. కులం పేరుతో ఎవరినీ దూషించరాదని, హోటళ్లలో కొందరిని చిన్నచూపు చూస్తూ వారికి ప్రత్యేక గ్లాసులు పెట్టరాదని ఎస్ఐ రాజశేఖర్ సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, మొబైల్ ఫోన్లలో ఓటీపీలు, పాస్వర్డ్లను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్