బిచ్కుందలో ముందస్తు బీజేపీల నేతల అరెస్ట్

4చూసినవారు
బిచ్కుందలో ముందస్తు బీజేపీల నేతల అరెస్ట్
హిందూ దేవతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. బుధవారం బిచ్కుందలో దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణుతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి, బైండోవర్ చేశారు. ఈ ముందస్తు అరెస్టులను బీజేపీ నాయకులు సిగ్గుచేటుగా విమర్శించారు. ఈ ఘటనతో నిరసనకారులను అడ్డుకోవడంపై రాజకీయ దుమారం రేగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you