ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సమావేశం

584చూసినవారు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సమావేశం
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ కిచన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి అధ్యక్షతన ఆదివారం పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో సంఘం పరిధిలోని 7 కొనుగోలు కేంద్రాల ద్వారా 3117 మంది రైతుల నుండి 141532 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 18.24 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా 252 మంది రైతుల నుండి 4157 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశామని, ధాన్యం కొనుగోలుకు సహకరించిన అధికారులకు, రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్