ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శనివారం 1వ వార్డులోని పబ్బతి హనుమాన్ ఆలయ కమిటీ తరపున నూతన మున్సిపల్ చైర్మన్, 1వ వార్డు కౌన్సిలర్ గాయిత్రి శ్యామ్ లను సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు సమస్యలను అడిగి తెలుసుకున్న చైర్మన్, త్వరలో పరిష్కారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.