ఉత్సవాల అవసరానికి సౌండ్ సిస్టమ్ అందజేత

6చూసినవారు
ఉత్సవాల అవసరానికి సౌండ్ సిస్టమ్ అందజేత
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉప్పర సంఘం ప్రతినిధులు సౌండ్ బాక్స్, యాంప్లిఫైయర్ అవసరమని కోరగా, ఆయన వెంటనే వాటిని సోమవారం అందజేశారు. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో జరిగిన ఈ సంఘటనలో స్థానికులు కౌన్సిలర్ సేవలను ప్రశంసించారు. కౌన్సిలర్ శ్రీధర్ ప్రజల అవసరాలను తీర్చడంలో ముందుంటున్నారు.

సంబంధిత పోస్ట్