ఎల్లారెడ్డిలోని 8వ వార్డులో ఇటీవల మృతి చెందిన ఓటర్ దర్జీ పోశెట్టి కుటుంబానికి, వార్డ్ కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ గుప్తా బుధవారం రూ.10 వేల చెక్కును అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ది శ్రీధర్, తన మేనిఫెస్టోలో వార్డు పరిధిలోని ఓటర్లలో ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలకు రూ.10 వేలు అందిస్తానని, ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, వివాహానికి రూ.11 వేలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఓటర్లు ఇళ్లు నిర్మించుకుంటే అవినీతి లేకుండా పర్మిషన్లు ఇప్పిస్తానని కూడా వాగ్దానం చేశారు. ఈ హామీలతో ఆకర్షితులైన ఓటర్లు సిద్ది శ్రీధర్ ను భారీ మెజారిటీతో గెలిపించారు.