జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమావేశమై, "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" కింద మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరిస్తుందని తెలిపారు.