ఆరోగ్యవంతమైన బాల్యం కోసం పల్స్ పోలియో

0చూసినవారు
ఆరోగ్యవంతమైన బాల్యం కోసం పల్స్ పోలియో
ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులో వైస్ చైర్ పర్సన్ మత్తమాల భాగ్యవతి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యకర భవిష్యత్తుకిచ్చే భరోసా అని, 5 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్